టీకా ఇవ్వకుండా వేసినట్లు నాటకం.. వీడియో వైరల్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ వ్యాక్సినేషన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారంది. ఓ వ్యక్తికి నర్సు వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు నాటకం ఆడింది. వ్యాక్సిన్ కోసం కర్చున్న వ్యక్తికి ముందుగా కాటన్ తో క్లీన్ చేసింది. 

ఆ తర్వాత వ్యక్తి భుజానికి సూది గుచ్చింది. కానీ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయకుండానే సిరంజ్ ను తీసేసింది. నర్సు ఇలా చేసిన విషయం ఆ వ్యక్తికి తెలియదు. టీకా తీసుకున్నట్లే భావించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది భారతదేశంలో జరిగినట్లు కొందరు తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తున్నారు. నిజానికి ఇది మెక్సికోలోని నేషనల్ పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూట్ లోని టీకా విభాగంలో జరిగింది. 

Leave a Comment