కోవిడ్ కొత్త కేసుల్లో టీకా తీసుకున్నవారే అధికం.. ఆరు నెలల్లో తగ్గుతున్న రోగనిరోధక శక్తి..!

కరోనా వైరస్ కేసుల విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ కొత్త కేసులు టీకా తీసుకున్న వారిలోనే అధికంగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఆరు నెలలకు మించి ఉండటం లేదని ఆమె తెలిపారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి దాని వెనక గల కారణాలను తెలుసుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. 

దుర్గా ఉత్సవాల తర్వాత పశ్చిమ బెంగాల్ లో గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగాయి. అయితే టీకాలు తీసుకున్న వారిలో మరణాలు అయితే సంభవించడం లేదు. కానీ ఆరు నెలల్లోనే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని మమతా బెనర్జీ తెలిపారు. రెండు డోసులు టీకా తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి ఆరు నెలలకు మించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు.   

Leave a Comment