మత్స్యకారుడి వలలో భారీ చేప.. వేలంలో రూ.36 లక్షల ధర..!

ఈమధ్య చాలా మంది మత్స్యకారులకు భారీ చేపలు వలలో పడుతున్నాయి. దీంతో వారు రాత్రికిరాత్రే లక్షాధికారులు అయిపోతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ మత్స్యకారుడికి అదృష్టం కలిసొచ్చింది. బార్మన్ అనే మత్స్యకారుడి వలలో భారీ ‘తెలియా భోలా’ చేప పడింది. దీంతో అతడు ధనవంతుడిగా మారిపోయాడు. 

పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్స్ నదులలో ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో వీరు తెలియా భోలా చేపను పట్టుకున్నారు. ఈ చేప సుమారు 7 అడుగుల పొడవు, 75 కిలోల బరువు ఉంటుంది. ఈ చేపను మత్స్యకారులందరూ కలిసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ చేపను హోల్ సేల్ మార్కెట్ కి తీసుకెళ్లగా అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. 

కిలో రూ.49,300 చొప్పున 75 కిలోల తేలియా భోలా చేపను రూ.36 లక్షలకు విక్రయించారు. ఈ చేప పొట్టలో అత్యంత విలువైన వనరులు ఉంటాయని, వాటిని మందులు, ఇతర వస్తువుల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యకారులు అంటున్నారు. ప్రతి ఏడాది తాను తెలియా భోలా చేపలు పట్టడానికి వెళ్తానని, కానీ ఇంత పెద్ద చేపను ఎప్పుడు పట్టుకోలేేదని మత్స్యకారుడు బార్మన్ తెలిపాడు.  

Leave a Comment