సీజనల్ వైరస్ గా కోవిడ్..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో కరోనా వైరస్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా యూనివర్సిటీ ఆఫ్ బీరుట్ కు చెందిన శాస్త్రవేత్తలు మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న తర్వాత సీజనల్ వైరస్ గా మారిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ కనిపించదని తేల్చారు. 

వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న కొంత మందిపై ప్రయోగాలు చేశారు. కొన్ని రోజుల పాటు వారిని ఒక ఉంచారు. అందులో కరోనా వైరస్ సోకిన వారున్నప్పటికీ ఇతరులకు అది వ్యాప్తి చెందే రేటు చాలా తక్కువగా ఉంది. జలుబు, దగ్గు మాదిరిగానే అది వచ్చిపోయింది. సామూహిక దశకు చేరుకున్నంత వరకు కరోనా వ్యాప్తి కొనసాగుతుందని పరిశోధకులు వెల్లడించారు. తర్వాత దాని తీవ్రత తగ్గుతుందన్నారు. అయితే కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ ప్రభావం సంవత్సరం మొత్తం ఉటుందని, ఉష్ణమండల దేశాల్లో దీని తీవ్రత అంతగా కనిపిచదని పేర్కొన్నారు. 

పరిశోధనల్లో భాగంగా పరిశోధకులు సీజనల్ వైరస్లను క్షుణ్నంగా పరిశీలించారు.వీటి ఆధారంగా కరోనా వైరస్ తీవ్రతను అంచనా వేశారు. గాలి, ఉపరితలాలపై వైరస్ మనుగడ సాగించగలదని మరోసారి రుజువు చేశారు. ఎక్కువ మంది గుమిగూడినప్పుడు వైరస్ సోకే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని వెల్లడించారు. వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ తదితర అంశాలపై వైరస్ వ్యాప్తి ఆధారపడుతుందని తేల్చారు. 

 

 

Leave a Comment