షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ నుంచి paytm యాప్ తొలగింపు

పేటీఎం వినియోగదారులకు గూగుల్ ప్లేస్టోర్ షాక్ ఇచ్చింది. పేటీఎంను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. భద్రత నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్ ను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. గతంలోనే పేటీఎంకు గూగుల్ నోటీసులు జారీ చేసింది. క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ తెలిపింది. పేటీఎం ఈ నిబంధనలను అతిక్రమించడంతో తొలగించినట్లు గూగుల్ స్పష్టం చేసింది. అయితే పేటీఎంకు చెందిన పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్ లు మాత్రం ప్లేస్టోర్ లో ఉన్నాయి. 

గూగుల్ ప్లేస్టోర్ నుంచి తమ యాప్ ను తొలగించడంపై పేటీఎం స్పందంచింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని, త్వరలనే యాప్ వస్తుందని పేటీఎం ప్రకటించింది. ప్రస్తుతం కొత్త పేటీఎం యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి, యాప్ అప్ డేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదని పేర్కొంది. పేటీఎం యూజర్ల డబ్బు భద్రంగానే ఉంది. మీ పేటీఎం లావాదేవీలు ఎప్పట్లాగే చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 

Leave a Comment