రేపటి నుంచి SBI కొత్త నిబంధనలు..!

స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అవి శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని SBI ఏటీఎలలో ఓటీపీ ఆధారిత విత్ డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఇక SBI ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేయాలి. రూ.10 వేలు లేదా అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్ తో పాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. 

ఈ సదుపాయాన్ని అన్ని వేళల్లో అంటే 24 గంటలపాటు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య SBI ఏటీఎంలలో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా ఉండేది.. తాజాగా మన డెబిట్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి డబ్బులు వస్తాయి. ఓటీపీ లేకపోతే రూ.10వేలకు మించి తీసుకోలేరు.. ఖాతాదారుల భద్రత కోసమే SBI ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అనధికార లావాదేవీలు, కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలు జరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు SBI ప్రకటించింది. 

Leave a Comment