కరోనా బాధితులను వెంటాడుతున్న మరో సమస్య..!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 45,083 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఈనేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఈక్రమంలో ఏపీకి కొత్తగా మరో 5 లక్షల 76 వేల డోసుల టీకాలు వచ్చాయి. ఢిల్లీ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్లు రాష్ట్రానికి రాగా, హైదరాబాద్ నుంచి మరో లక్ష కోవాగ్జిన్ డోసులు రానున్నాయి. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరిస్తున్నా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. కాగా ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లను కొత్త అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక కరోనా టీకాల వల్ల రక్తం గడ్డకడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకా తీసుకున్న వారిలో కంటే కరోనా సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువ అని తేల్చారు. ఫైజర్, ఆస్ట్రాజెనికా తొలి డోసులు తీసుకున్న 2.9 కోట్ల మందిపై అధ్యయనం చేశారు. వారిలో కొంత మందికి రక్తం గడ్డకట్టడాన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ ముప్పు కరోనా సోకిన వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. 

Leave a Comment