లాక్ డౌన్ పొడిగిస్తే..దేశంలో ‘కలర్ కోడ్’ అమలు!

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాల్సి వస్తే ..ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా ఓ కలర్ కోడ్ ను తీసుకొచ్చింది. ఇండియా మ్యాప్ లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనే మూడు కలర్ జోన్లుగా విభిజించారు. దీని ద్వారా ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఉండదని, ఎకానమీని కొంత వరకైనా పునరుద్ధరించవచ్చని భావస్తుంది. 

అసలు కేసుల్లేని జిల్లాలను గ్రీన్ జోన్లుగా, 15 కంటే తక్కువ కేసులు ఉన్న ప్రదేశాలను ఆరెంజ్ జోన్లుగా, 15 కంటే ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా విభజించారు. శనివారం పలు రాష్ట్రా సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా లేని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను సడలించే అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ సూచన ప్రాయంగా చెప్పారు. 

గ్రీన్ జోన్లుగా ఉన్న జిల్లాలో పరిమితంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును అనుమతించడం, వ్యవసాయోత్పత్తులకు అనువుగా హార్వెస్టింగ్ కి పర్మిషన్ ఇస్తారని సమాచారం. 15 కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్న జిల్లాలను రెడ్ రోజ్ కిందకు చేర్చారు. ఎకానమీని పునరుద్ధరించే యత్నంలో భాగంగా మోడీ తన మొదటి ప్రసంగంలో ‘జాన్ హై తో జహాన్ హై’ అని చెప్పారు. అయితే ఇప్పుడు ‘జాన్ భీ, జహాన్ భీ’ అని వ్యాఖ్యానించడం విశేషం. 

లాక్ డౌన్ కారణంగా భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.5 నుంచి 2.8 శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దీంతో  వేలాది మంది వలస కార్మికుల జీవనోపాధి కోసం మౌలిక సదుపాయాల రంగంలో సడలింపులు ఉంటుందని ప్రధాని సూచించారు. వ్యవసాయ రంగంలో సడలింపులు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఫుడ్ ప్రొసెసింగ్, ఏవియేషన్, ఫార్మాస్యూటికల్స్, పరిశ్రమలు, నిర్మాణం మొదలైనవి సడలింపు కిందకి వస్తాయని భావిస్తున్నారు. అయితే సామాజిక దూరం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 

Leave a Comment