పాలన ఎలా చేయాలో చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాలి..

దేవినేని ఉమా మహేశ్వర రావు

లాక్ డౌన్ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాగ్రత్తులు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆలోచిస్తున్నాయని, జగన్ మాత్రం జోన్లు, మండలాల గురించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేవ్వరరావు విమర్శించారు. మూడు ముక్కలాటలో భాగంగా ఏప్రిల్ 28కల్లా తట్టాబుట్టా సర్దుకుని విశాఖ పట్నం వెళ్లడానికి రెడీ అవుతున్నారన్నారు. రాజధాని రైతులు ఆందోళనను పట్టించుకోకుండా గ్రూప్  కాన్ఫరెన్స్, స్కైప్ వీడియా కాన్ఫరెన్స్ కు రమ్మని రైతు కూలీల మీద ఒత్తిడి తేవడం వల్ల ఇద్దరు రైతులు చనిపోయారని ఆరోపించారు.

 సుమారు 60 మంది రైతులు అమరావతి ప్రాంతంలో చనిపోయారు. ఏప్రిల్ 24 వరకు హైకోర్టు ఆదేశాలు ఉండటంతో కరోనా ఏం లేదని చెబుతున్నారన్నారు. ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చుకోవడం, ఉపాధి హామీతో రైతులను కాపాడే అంశాలను పక్కన పెట్టి కరోనాను 30, 40 మండలాలకు పరిమితం చేయండని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ చెప్పారన్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మార్చి 15న ఎస్ ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. మహేష్ బాబు స్పైడర్ సినిమాలో భైరవుడు పాత్ర ప్రవర్తించినట్లు జగన్ ప్రవర్తిస్తున్నాడన్నారు. 

చంద్రబాబు అమరావతి వస్తే క్వారంటైన్ లో పెడతామంటున్నారని, ఎలక్షన్ కమిషనర్ కనగరాజ్ ను క్వారంటైన్ లో పెట్టరా అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలన చేతకాదన్నారు. పాలన ఎలా చేయాలో చంద్రబాబు వద్ద నేర్పమనండని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో నెల మొత్తం ఎలా బతుకుతారని, రూ.5వేలు పేదల అకౌంట్లో వేయమంటే అధికార పార్టీ నేతలకు ఎగతాళిగా ఉందని చెప్పారు. 

ప్రజల ప్రాణాలు కాపాడిన రమేష్ కుమార్ పంపేందుకు ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ ప్రభుత్వానికి వంత పాడటం సరికాదన్నారు. కనగరాజ్ కు అరబిందోకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. వాటికి విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. 

Leave a Comment