ఆన్ లైన్ విద్యను మెరుగుపరిచేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన యూజీసీ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేశంలోని అన్ని విద్యా సంఘాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) అభ్యర్థిస్తోంది. ఈ-వనరులను సమీకరించడం మరియు దేశంలో ఆన్ లైన్ విద్యా వ్యవస్థలను  మెరుగుపరచడంపై సిఫార్సు చేయడానికి యూజీసీ ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 

ఇంట్లోనే బోధన మరియు అభ్యాసన చేయడం ద్వారా విద్యా నష్టాన్ని తగ్గించడానికి యూజీసీ ఇటీవల మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ ఫాముల లింక్ లను షేర్ చేసింది. వెబ్ సైట్లు, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ విద్య  గురించి అవకగాహన కల్పించాలని అభ్యర్థించింది. 

ఈ డిజిటల్ ప్లాట్ ఫాంలను విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులు, జీవితకాల అభ్యాసకులు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విషయంలో యూజీసీ ఈ-వనరులను సమీకరించడానికి మరియు దేశంలో ఆన్ లైన్ విద్యావ్యవస్థను మెరుగుపరచడంపై సిఫార్సు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 

భారత దేశంలో ఈ-లెర్నింగ్ మరియు ఆన్ లైన్ విద్యను పెంచడానికి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో సహా విద్య నిపుణుల నుంచి సలహాలు, సూచనలు చేయడానికి హ్యూమన్ రీసోర్స్ డెవెలప్మెంట్ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ‘Bharath Padhe Online’ అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. తమ సలహాలు, సూచనలను ఆన్ లైన్ ద్వారా పంచుకోవడానికి చితరి తేదీ ఏప్రిల్ 16, 2020 గా నిర్ణయించారు. 

అన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ‘Bharath Padhe Online’ ప్రచారం యొక్క వివరాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిపుణులతో పంచుకోవాలని యూజీసీ సూచించింది. తమ సలహాలు, సూచనలను ట్విట్టర్ లేదా ఈమెయిల్ ద్వారా అందించమని కోరింది. 

Leave a Comment