కరోనా వైరస్ ఇండియాలోనే పుట్టింది : చైనా

కరోనా వైరస్ పుట్టుకపై చైనా శాస్త్రవేత్తలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి భారత్ లేదా బంగ్లాదేశ్ లో పుట్టిందని షాంఘై ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు ఆరోపించారు. గతేడాది డిసెంబర్ లో వూహాన్ లో వైరస్ వ్యాపించక ముందే భారత్ ఉపఖండంలో వైరస్ ఉనికిలో ఉందన్నారు. 

వూహాన్ లో కరోనాను గుర్తించకముందే 2019 వేసవిలోనే భారతదేశంలో ఇది ఉద్భవించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మనుషులలో ప్రవేశించిందని పేర్కొంది. కరోనా వైరస్ మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేస్తోంది. దీని ద్వారా వూహాన్ లో పుట్టింది అసలైన వైరస్ కాదని చెప్పింది. 

Leave a Comment