మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం..

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలో ఆయన నివాసం నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని దుండగుడు తాపీతో మంత్రి పేర్నిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది.నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  పోలీసులు నిందుతుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.  

Leave a Comment