కరోనాకు ఉప్పు నీళ్లు చాలట.. ప్రజలకు ఉత్తర కొరియా ప్రభుత్వం సూచన..!

కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. కరోనాను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు టీకాలు వేస్తున్నారు.. అయితే ఉత్తర కొరియా ప్రభుత్వం మాత్రం కరోనాను కట్టడి చేసేందుకు ఉప్పు నీళ్లు చాలని చెబుతోంది.. వంటింటి చిట్కాలతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని దేశ ప్రజలకు సూచించింది.. 

ఇప్పటికే ఉత్తర కొరియా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్కరోజు 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో 6 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 62కి చేరింది. ప్రస్తుతం ఆరు లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారు. అయితే జ్వరం లక్షణాలను కిమ్ సర్కార్ కరోనాగా గుర్తించలేదు.. 

మరో వైపు ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది..ఈక్రమంలో కిమ్ సర్కార్ కరోనా కట్టడికి ఉప్పు నీళ్లు ఉత్తమమని దేశ ప్రజలకు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. ఉప్పు నీళ్లు పుక్కిలించడంతో పాటు ఇతర వంటింటి చిట్కాలు పాటించాలని సూచించింది. దీంతో పాటు విల్లో ఆకులు, అల్లం టీ తీసుకుంటే సరిపోతుందని చెప్పినట్లు ఆ దేశ మీడియాలో ఓ మహిళ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. 

 

Leave a Comment