మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా..కరోనా వచ్చిన తొలి సీఎం..!

కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ్యలుు కరోనా బారినపడగా..తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు శనివారం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో రిపోర్టులో పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆయనను భోపాల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్ రావడంతో ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. 

Leave a Comment