ఏది కరోనా వ్యాధి? ఏది సీజనల్ వ్యాధి?

ఇది వర్షాకాలపు సీజన్. ఈ సీజన్ లో సీజనల్ వ్యాధులు రావడం సహజం. కానీ ఈ సీజన్ లో చిన్న పాటి జ్వరం వచ్చినా, తుమ్ములు, తగ్గు వచ్చినా ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. ఏం వచ్చినా అది కరోనానే అన్నట్లు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు తమకు వచ్చిన  రోగమేదో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ఇలాంటి ఫ్లూలను లక్షణాల ఆధారంగా అంచనా వేయవచ్చని నిపుణులు అంటున్నారు. కరోనా లక్షణాలకు, సీజనల్ లక్షణాలకు తేడా ఏంటో తెలుసుకుందాం..దీని ద్వారా ఏదీ కరోనా వ్యాధి..ఏదీ సీజనల్ వ్యాధి అని నిర్ధారణ చేసుకోవచ్చు. 

 

కరోనా లక్షణాలుసీజనల్ లక్షణాలు
తీవ్ర జ్వరంసాధారణ జ్వరం
మూడు రోజులైనా తగ్గదుమూడు రోజుల్లో తగ్గుతుంది
జలుబు ఉన్నా ముక్కు కారదుముక్కు కారుతుంది
పొడి దగ్గు వస్తుందికఫంతో కూడిన దగ్గు వస్తుంది
రుచి, వాసన తెలియదురుచి, వాసన తెలుస్తుంది
తలనొప్పి తీవ్రంగా ఉంటుందిసాధారణంగా ఉంటుంది
ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటాయిసాధారణంగా ఉంటాయి
గొంతు నొప్పి ఉంటుందిగొంతు నొప్పి ఉంటుంది
ఛాతిలో నొప్పి వస్తుందిఛాని నొప్పి ఉండదు
కండ్లు ఎర్రబడతాయికండ్లు ఎర్రబడవు
వాంతులు, విరేచనాలు ఉంటాయివాంతులు, విరేచనాలు ఉంటాయి

 

Leave a Comment