అక్టోబర్ లో  స్కిల్ కాలేజీల ప్రారంభం : మంత్రి మేకపాటి

అక్టోబర్ లో ఐదు నైపుణ్య కళాశాలలను లాంఛనంగా ప్రారంభించడమే లక్ష్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్ కాలేజీల ప్రారంభోత్సవం చేస్తామన్నారు.  మిగతా 25 స్కిల్ కాలేజీలు కొత్త ఏడాది జనవరిలోనే ప్రారంభిస్తామన్నారు. 

అనుకున్న సమయానికి అనుకున్నవి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.  30 కాలేజీలపై పర్యవేక్షణకు  ‘ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్’ ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబర్ లో ప్రారంభించే 5 కాలేజీలు సహా అన్ని కాలేజీల డిజైన్లు, లేఔట్లకు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో స్కిల్ కు సంబంధించిన కోర్సులు, కరికులమ్ పై హై నెట్ వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, మానవవనరుల వివరాలపై సర్వేకు నైపుణ్య శాఖ సిద్దంగా ఉందన్నారు. త్వరలోనే యాప్ ద్వారా సర్వే ప్రారంభించే అవకాశం ఉందన్నారు. 

 

Leave a Comment