తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ లో హోం ఐసోలేషన్ లో ఉంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. 

సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎంకు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు.  

Leave a Comment