మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈనేపథ్యంలో వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా స్పీడు పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సెకెండ్ వేగంగా విస్తరిస్తుండటంతో సోమవారం ప్రధాని మోడీ వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

Leave a Comment