ఇండియాలో మీరు చూడని అద్భుతమైన శివాలయాలు.. ఒకసారి చూడండి..!

భారతదేశంలో ప్రసిద్ది చెందిన శివాలయాలు ఉన్నాయి. వాటిని సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా యాత్రికులు వస్తుంటారు. దేశంలోని ఆలయాలు ఎక్కువగా రాజ కుటుంబాల వారే నిర్మించారు. వీటిలో కొన్ని అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. భారతదేశంలో ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యటకంగానూ చూడాల్సిన ఆలయాలు చాలనే ఉన్నాయి. వాటిలో మీరు చూడని అద్భుతమైన శివాలయాల గురించి తెలుసుకుందాం..

శివ హోమం శివాలయం, బెంగళూరు

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన శివాలయాలలో శివ హొమం శివాలయం ఒకటి. ఈ శివాలయం కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఈ శివాలయంలో అతిపెద్ద శివలింగ ద్వారం ఉంది. 65 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. ఈ ఆలయం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో 32 అడుగుల ఎత్తయిన వినాయక విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కోరిన కోరికలు నిజమవుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం..

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం, కర్ణాటక

కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి.. ఇక్కడ ఉన్న అద్భుతమైన లింగం 108 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఈ భారీ లింగానికి చుట్టూ 15 ఎకరాల అనేక చిన్న లింగాలు ఉంటాయి. ఈ ఆలయం 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఆలయం కాంపౌండ్ లో 35 అడుగుల ఎత్తయిన నంది విగ్రహం ఉంది. ఈ ఆలయంలో సుమారు కోటి శివలింగాలు ఉంటాయి. 

కేదార్ నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్..

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ హిమాలయాలలో, మందాకిని నదికి సమీపంలో కేదార్ నాథ్ ఆలయం ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన శివాలయం. ప్రపచంలోని అన్ని ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ మరియు నవంబర్ నెలల మధ్య తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్ నాథ్ ఆలయం నుంచి విగ్రహాన్ని ఉఖిమత్ కు తీసుకొచ్చి పూజిస్తారు. ఈ దేవాలయానికి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేరుకోలేము.

సిద్ధేశ్వర ధామ్, సిక్కిం

సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ నుంచి సిద్ధేశ్వర ధామ్ ఆలయం చేరుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. చుట్టూ అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి. ఈ ఆలయం విష్ణువు, శ్రీకృష్ణుడు, జనగ్నాథుడు మరియు శివుడికి అంకితం చేయబడిన నాలుగు పుణ్య క్షేత్రాలను కలిగి ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, 108 అడుగుల శివుని విగ్రహం ఉంది. 

ముర్దేశ్వర్ శివాలయం, కర్ణాటక

ముర్దేశ్వర్ శివాలయం కర్ణాటకలోని కందుల కొండపై ఉంది. ఆలయం మూడు వైపుల అరేబియా సముద్రం ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయంలో 20 అంతస్థుల గోపురం ఉంది. ఈదేవాలయంలో ఉన్న 123 అడుగుల శివుని విగ్రహం ప్రపంచంలోని రెండో ఎత్తయిన శివుని విగ్రహం.. ఇక విగ్రహం మీద సూర్య కాంతి పడే దృశ్యాన్ని చూడొచ్చు. 

నాగేశ్వర్ దేవాలయం, గుజరాత్

ఈ ప్రసిద్ధ శివాలయం ద్వారక నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. చెరువుతో కూడిన అందమైన ఉద్యానవం మరియు 25 మీటర్ల ఎత్తయిన శివుని విగ్రహం ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ. 

Leave a Comment