సీఎం జగన్ వల్లే రాష్ట్రంలో కరోనా..!

ఏపీలో సీఎం జగన్ వలన కరోనా విజృంభిస్తోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కరోనాను కట్టడి చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పక్క రాష్ట్రాల వారికి కూడా తెలిసిందన్నారు. ఏపీ వాళ్లు రావడానికి వీల్లేదని తమిళనాడు వారు గోడ కట్టేశారని, కర్ణాటక వారు కూడా అడ్డుగా గోడ కట్టేశారని అన్నారు. గ్రామాల్లోనూ కంచెలు వేసేశారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందంటే అందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో ఆలోచన చేయాలన్నారు. 

రేషన్ తీసుకునే సమయంలో బయోమెట్రిక్ తప్పనిసరి అంటున్నారు..అందరు ఒక్క చోటే గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందదా? ఎమర్జెన్సీలో వేలిముద్రలు అవసరమా అని అయ్యన్న పాాత్రుడు ప్రశ్నించారు. వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయాలన్నారు. 

క్వారంటైన్ లో నాసిరకం ఆహారం..

అనుమానితులను క్వారంటైన్ లో ఉంచుతున్నారని, వారికి భోజనం కింద  మనిషికి రూ. 500 అని చెబుతున్నారని అన్నారు.  కానీ రూ. 100 ఖరీదు చేయని నాసిరకం ఆహారం వారికి అందిస్తున్నారని, వారికి పెట్టే భోజనంలో కూడా మీరు కమీషన్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.  

Leave a Comment