మార్కెట్ లో ధరల స్థిరీకరణ పరిస్థితులు 

పంటల కొనుగోలులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై సీఎం జగన్ సమీక్షలో చర్చించారు.  వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది  రైతుల వద్ద నుంచి ఎక్కువే కొనుగోలు చేశామని సీఎం జగన్ తెలిపారు. గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామన్నారు. 

ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతి ద్వారా కొనుగోలు తదితర చర్యలతో ముందుకు సాగుతున్నాయని అధికారులు వివరించారు. అరటి, టొమాటో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలలని సీఎం తెలిపారు. చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలన్నారు. 

గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటి ద్వారా కూరగాయలను పంపిస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు వెల్లడించారు. రెడ్‌జోన్లకు చేరువగా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగాలని సీఎం జగన్ ఆదేశించారు. 

 

Leave a Comment