క్రికెటర్ అశ్విన్ ఇంట్లో 10 మందికి కరోనా..!

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న 10 మంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. శుక్రవారం టెస్టులు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ట్వీట్ చేసింది. 

ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్ద వాళ్లు, నలుగురు పిల్లలకు పాజిటివ్ తేలిందని, పిల్లల వల్ల అందరికీ పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. గతవారం ఓ పీడకలలా గడిచిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, టీకా తీసుకోవాలని అశ్విన్ భార్య ట్వీట్ చేసింది. కాగా, ఇప్పటికే అశ్విన్ ఐపీఎల్ నుంచి బయటికి వచ్చాడు. తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ఐపీఎల్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.  

Leave a Comment