ఇండియా నుంచి వస్తే 5 ఏళ్లు జైలు.. ఆస్ట్రేలియా వార్నింగ్..!

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న తేదీకి 14 రోజులలోపు ఇండియాలో ఉన్న వాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడాన్ని నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వస్తే వారికి ఐదేళ్లు జైలు శిక్ష లేదా సుమారు రూ.49 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రకటన విడుదల చేసింది. ఇండియాలో కరోనా కేసులు భారీస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియా నుంచి ప్రయాణికులను అనుమతించకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించింది. అయితే మే 3 నుంచి తమ ఆదేశాలను కాదని వస్తే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. 

అయితే ఇది అంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదని, కానీ ఆస్ట్రేలియా పౌరుల ఆరోగ్యం తమకు ముఖ్యమని పేర్కొంది. క్వారంటైన్ లోని కోవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. మే 15 తర్వాత ఈ ఆంక్షలపై మరోసారి సమీక్షించనున్నారు. 

Leave a Comment