కరోనా ఎఫెక్ట్ : మరణాలు అధికంగా ఉన్న 10 దేశాలు..

అమెరికాలో 5వేలకు చేరిన మృతులు

కరోనా వైరస్ ధాటికి అమెరికా విలవిల్లాడిపోతోంది. అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం ఒక్క రోజే 884 మంది చనిపోయారు. కరోనా కట్టడికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రానికి అమెరికాలో 5,110 మంది మరణించారు.  అమెరికాలో ఇప్పటికీ 2,15,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఇక ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 9 లక్షలకు చేరింది. దాదాపు 50వేల మంది చనిపోయారు. సుమారు 2 లక్షల మంది ఈ వ్యాధి బారినపడి కోలుకున్నారు. 

భారతదేశంలోెనూ కరోనా వైరస్ రోగుల సంఖ్య రెండు వేలకు చేరింది. 58 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 111కు చేరుకున్నాయి. 

మరణాలు అధికంగా ఉన్న దేశాలు..

ఇటలీ – 13,155

స్పెయిన్ – 9,387

అమెరికా – 5,116

ఫ్రాన్స్ – 4,043

చైనా – 3,316

ఇరాన్ – 3,036

బ్రిటన్ – 2,357

నెదర్లాండ్స్ – 1,173

జర్మనీ – 931

బెల్జియం – 828

Leave a Comment