వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020 రద్దు

కరోనా ఎఫెక్ట్ ప్రసిద్ధి చెందిన విబుల్డన్ గ్రాండ్ స్లామ్ మీద కూడా పడింది.ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ మరియు క్రోకెట్ క్లబ్ వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020 ను రద్దు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడు మొదటి సారిగా వింబుల్డన్ రద్దు అయింది. అయితే వింబుల్డన్ ఇంతకముందు 1915, 1916, 1917, 1918, 1940, 1941, 1942, 1943, 1944, 1945 లలో రద్దు చేయబడింది. ఈ టోర్ని రద్దుపై రోజర్ ఫెదరర్ ట్విట్టర్ లో స్పందించారు. కరోనా మహమ్మారి కారణంగా వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020 రద్దు చేయాలని ఈ రోజు నిర్ణయించినందుకు చాలా విచారం వ్యక్తం చేశారు. అలాగే ఏడు సార్లు వింబుల్డన్ గెలిచిన సెరెనా విలియమ్స్ కూడా ‘షాక్డ’ అని పోస్ట్ చేసింది. అయితే కరోనా వైరస్ కారణంగా అన్ని ప్రధాన క్రీడలు నిలిచిపోయాయి. 

Leave a Comment