ఏపీలో జూలై నాటికి కరోనా తగ్గుముఖం.. అధ్యయనంలో వెల్లడి..!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఈక్రమంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ(డీమ్డ్ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు గుడ్ న్యూస్ అందించారు. 

జూలై 15 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశ్లేషణ టీం చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తాజాగా దానికి సంబంధించిన నివేదికను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు పంపించారు. 

ఎస్ఆర్ఎం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మే 21వ తేదీ నాటికి 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్ 14 నాటికి వెయ్యి కేసులు.. జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేస్తోంది. అలాగే జూలై 15వ తేదీ నాటికి 100 కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఎస్ఆర్ఎం విద్యార్థులు తాము రూపొందించిన డేటాను ఉపయోగించి ఈ విశ్లేషణ జరిపారు. 

Leave a Comment