కిలాడీ పోలీస్.. యువకులను ట్రాప్ చేసి మూడు పెళ్లిళ్లు..!

డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి  ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి వ్యవహారం బయటపడింది. సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ చేయడం సాధారణంగా చూస్తూనే ఉన్నాం.. కానీ హైదరాబాద్ లో ఓ ఏఆర్ మహిళ కానిస్టేబుల్ అబ్బాయిలకు ఎర వేస్తోంది.. నేరగాళ్లను పట్టుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతోంది.. 

గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకుంది. వారిలో ఇద్దిరికీ విడాకులు ఇవ్వగా మరొక కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసింది.  ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుంది. కొద్ది రోజులు అయ్యాక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. 

పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని, లేకపోతే కలిసి తిరిగిన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించింది. గతంలో వివాహాల విషయం చెప్పకుండానే చరణ్ ను నమ్మించి పెళ్లిచేసుకుంది. తర్వాత విషయం తెలుసుకున్న చరణ్ కానిస్టేబుల్ సంధ్య రాణి ట్రాప్ నుంచి తనను రక్షించాలని శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. 

ఒంటరిగా ఉన్న అబ్బాయిలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సంధ్య రాణి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరాడు. గతంలో సంధ్య రాణి వరుస పెళ్లిళ్లపై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

పోలీస్ ఉద్యోగం అని భయపడకుండా ఇష్టమొచ్చిన వారితో తిరుగుతుందని తల్లిదండ్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా వేరే రూమ్ తీసుకొని వారితో గడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పైగా పోలీస్ డిపార్ట్ మెంట్ నే అడ్డుపెట్టుకుని అబ్బాయిలకు వల వేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment