కరోనా మందు కోసం 18 నెలలు ఆగాల్సిందే : WHO

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో  కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా స్పందించింది. ఇప్పటి వరకూ దీనికి మందు కనుగొనలేదని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ కోసం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని WHO డైరెక్టర్ టెడ్రెస్ తెలిపారు. కరోనా బాధితుల చికిత్సలో ఎదరవుతోన్న సవాళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య ప్రతినిధులతో WHO చర్చలు జరిపిందన్నారు. 

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం 18 నెలల సమయం పడుతుందని చెప్పారు. మందుకు కనుగొనేందుక చాలా దేశాలు ముందుకొస్తున్నాయన్నారు.

Leave a Comment