కరోనా వ్యాప్తికి కారణమైన వ్యక్తికి 5 ఏళ్లు జైలు శిక్ష..!

కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే.. దీంతో దాదాపు అన్ని దేశాలు కరోనా కఠిన నిబంధనలు అమలు చేశాయి. కోవిడ్ నిబంధనలు పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణమైన వారికి కఠిన శిక్షలు కూడా కొన్ని దేశాలు విధించాయి. అలా వియాత్నంలో కరోనా వ్యాప్తికి కారణమైన ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 

వియాత్నంలో కరోనా కేసులు భారీగా నమదవుతున్నాయి. అక్కడ ఈ ఏడాది జూన్ నుంచి డెల్టా వేరియంట్ విజృంభించడంతో కేసులు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు 5,30,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13,300 మంది కరోనాతో మరణించారు. అందులో అత్యధిక మరణాలు గత రెండు, మూడు నెలల్లో నమోదైనవే.. అక్కడి హో చి మిన్ సిటీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 

ఈక్రమంలో ‘లీ వేన్ ట్రీ’ అనే 28 ఏళ్ల వ్యక్తి హో చి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు ‘కా మావూ’కు బైక్ పై వెళ్లాడు. అయితే ‘కా మావూ’లో తన హెల్త్ డిక్లరేషన్, ట్రావెల్ హిస్టరీని తప్పుగా ఇచ్చాడు. అయితే ఇతర ప్రాంతాల నుంచి ‘కా మావూ’ వచ్చినప్పుడు కనీసం 21 రోజులు ఐసోలేషన్ లో ఉండాలి. కానీ లీ వెన్ ట్రీ ఆ నియమాలను పాటించలేదు. ఆ తర్వాత లీ వేన్ ట్రీకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన సందర్శించిన ఓ వెల్ఫేర్ సెంటర్ సిబ్బందికి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో లీ వేన్ ను న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. అతనికి ఐదేళ్లు జైలు శిక్ష పడింది. దీంతో పాటు 880 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.64 వేలు జరిమానా విధించి అక్కడి న్యాయస్థానం..

 

Leave a Comment