సలసల కాగే నీటిలో బాలుడు.. వైరల్ వీడియో..!

సాధారణంగా బాగా ఎక్కువ వేడిన ఉన్న నీటితో స్నానం చేయాలంటేనే తట్టుకోలేము.. అలాంటిది సలసల కాగే నీటిలో కూర్చోవాలంటే మామూలు విషయమా.. కానీ ఇక్కడ ఓ బాలుడు సలసల కాగుతున్న నీటిలో కూర్చున్నాడు. ప్రస్తుతం బాలుడు నీటిలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది. 

ఈ వీడియోలో బాలుడు ఓ కడాయిలో కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు మరుగుతోంది. అయినా ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు. అంత మరుగుతున్న నీటిలో ఆ బాలుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంతో ఆ బాలుడ్ని చూస్తూ ఉండిపోయారు. 

ఈ వీడియో కొంచెం పాతదే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైనరీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది ఫేక్ అని, బాలుడు జనాలను మోసం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హల్ చల్ చేస్తోంది..   

 

Leave a Comment