రష్యాలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజులోనే..!

రష్యాలో కరోనా మరణ మృదంగం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 1,159 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 వేల 096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రష్యా దేశంలో రోజువారీ కేసులు, మరణాల్లో ఇప్పటివరకు ఇవే అత్యధికం..వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. 

రష్యా రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్ వర్కింగ్ పీరియడ్ ప్రారంభమైంది. అంటే అత్యవసర విధుల్లో ఉన్న వారు తప్ప మిగితా ఉద్యోగులు విధులకు హాజరు కాకూడదు. కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్నా.. అక్కడి ప్రజల్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రష్యా నుంచి ఈజిప్టు, టర్కీకి ప్యాకేజీ టూర్ల సంఖ్య భారీగా పెరిగింది. రష్యాలో వ్యాక్సిన్ కూడా చాలా తక్కువ మంది తీసుకున్నారు. రష్యా జనాభా 14.6 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు 4.9 కోట్ల మంది మాత్రమే రెండు డోసుల టీకా తీసుకున్నారు. 

Leave a Comment