భారతీయుడికి రూ.1.52 కోట్ల కరోనా బిల్లు మాఫీ..!

దుబాయ్ లోని ఓ ఆస్పత్రి యాజమాన్యం ఒక భారతీయుడి పట్ల ఔదార్యం ప్రదర్శించింది. కరోనా చికిత్సకు అయిన రూప.1.52 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతే కాదు ఇండయన్ కాన్సులేట్ విజ్ఞప్తితో బిల్లును మాఫీ చేసి ఫ్లయిట్ టికెట్ ఇచ్చి, జేబులో రూ.10వేలు పెట్టి ఇండియాకు పంపించింది. 

తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమల్లకు చెందిన ఓడ్నాల రాజేష్(42) దుబాయ్ లో ఉంటున్నాడు. అతనికి కరోనా సోకడంతో ఏప్రిల్ 23న ఓ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి  రాజేష్ చికిత్స పొందుతున్నారు. 80 రోజుల తర్వాత కోలుకున్న అతనికి ఆస్పత్రి రూ.1.52 కోట్ల బిల్లు వేసింది. తనకు అంత డబ్బులు కట్టే స్థోమత లేదని ఆ వ్యక్తి విన్నవించుకున్నారు. ఈ విషయం ఇండియన్ కాన్సులేట్ వద్దకు చేరింది. ఇండియన్ కాన్సులేట్ విజ్ఞప్తి చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం అతడి బిల్లును మాఫీ చేసింది. 

అంతేకాదు అతడు ఇండియా తిరిగి వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్ బుక్ చేసింది. రూ.10 వేలు ఇచ్చి రాజేష్ కు ఇండియాకు పంపించింది. ఈ బుధవారం రాజేష్ హైదరాబాద్ కు చేరుకున్నాడు. దుబాద్ ఆస్పత్రి తనపై చూపిన మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. రాజేష్ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంచనున్నట్లు ఎన్నారై సెల్ సీనియర్ అధికారి తెలిపారు. 

Leave a Comment