క్యాన్సర్ ను చంపే కొవ్వు ఆమ్లాల గుర్తింపు..!

క్యాన్సర్ కు వ్యతిరేకండా పోరాటంలో శాస్త్రవేత్తలు ఓ పెద్ద పురోగతిని సాధించారు. మానవులలో క్యాన్సర్ ను చంపే కొవ్వు ఆమ్లాలను కనుగొన్నారు. డిహోమో గామ లినోలెనిక్  లేదా డీజీఎల్ఎ అని పిలువబడే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను చంపగలదని నిరూపించారు. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ డైహోమో గామ లినోలెనిక్ ఆమ్లం యొక్క తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిన్ ను ప్రేరేపిస్తుందని అధ్యయనంలో కనుగొన్నారు. ఫెర్రోప్టోసిన్ అంటే దెబ్బతిన లేదా  పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్థవంతంగా నాశనం చేయడం. 

క్యాన్సర్ కణాలలో డీజీఎల్ఎను బట్వాడా చేయగలిగితే అది ఫెర్రోప్టోసిస్ ను ప్రోత్సహిస్తుందని, దీని ద్వారా కణతిలో క్యాన్సర్ కణాలను చంపేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫెర్రోప్టోసిన్ ద్వారా మూత్రపిండాల సంబంధిత వ్యాధులు, న్యూరోడీజెనరేషన్ వ్యాధులపై అధ్యయనం చేస్తున్నట్లు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాట్స్ తెలిపారు. 

 

Leave a Comment