హెల్మెట్ ధరించి బస్సు నడిపిన డ్రైవర్..!

సాధారణంగా బైక్ పై వెళ్లే వారు హెల్మెట్ ధరిస్తారు.. కానీ, బస్సు, కారు, లారీలు నడిపే డ్రైవర్లు హెల్మెట్ ధరించడం ఎప్పుడైనా చూశారా? చూడలేదు కదూ.. కానీ అలాంటి ఘటన యూపీలో కనిపించింది.. ఘజియాబాద్ లో ఓ డ్రైవర్ హెల్మెంట్ ధరించి బస్సు నడిపాడు.. ప్రస్తుతం ఈ బస్ డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం సాయంత్రం లోని బాగ్ పత్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. 

లోని బస్ డిపోకు చెందిన ఓ బస్ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపాడు. కొందరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఈ బస్సును వీడియో తీశారు.. అయితే ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. వాతావరణం బాగాలేకపోవడంతో వర్షం, గాలి నుంచి రక్షణ కోసం డ్రైవర్ ఇలా హెల్మెట్ ధరించి బస్సు నడిపాడు. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.   

Leave a Comment