పరిగెత్తుతూ అంబులెన్స్ కు దారి కల్పించిన కానిస్టేబుల్ ..!

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటుందో తెలిసిందే..అలాంటి ట్రాఫిక్ లో అంబులెన్స్ సకాలంలో వెళ్లాలంటే ఎంతో కష్టం.. అయితే ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ సైరన్ విని, అందులో ప్రాణాపాయస్థితిలో రోగి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వాహనదారులను పక్కకు జరుపుతూ ఆ అంబులెన్స్ కు దారి ఇచ్చారు. అంబులెన్స్ సకారంలో ఆస్పత్రికి చేరేలా దారి కల్పించిన ఓ ప్రాణాన్ని కాపాడాడు. 

అబిడ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ ఈనెల 2న అబిడ్స్ సర్కిల్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయంత్రం సమయంలో అబిడ్స్ చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది. ఆ ట్రాఫిక్ లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో ప్రాణాపాయ స్థితిలో రోగి ఉన్నాడు. దీనిని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. 

వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాహనదారులను ‘తప్పుకోండి..తప్పుకోండి’ అంటూ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటే అంబులెన్స్ కు దారి కల్పించాడు. ఆ కానిస్టేబుల్ అబిడ్స్ బిగ్ బజార్ నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్ వరకు పరిగెత్తాడు. ఈ సమయంలో రోగి బంధులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో ప్రాణాపాయం నుంచి రోగి బయటపడ్డాడు. సకాలంలో స్పందించినందుకు అబిడ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీని ఉన్నతాధికారులు అభినందించారు. 

Leave a Comment