వ్యభిచారం నేరం కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!

వ్యభిచారం కేసు విషయంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని పేర్కొంది. వ్యభిచారానికి పాల్పడే వ్యక్తికి జరిమానా విధించే నిబంధనల లేదని తెలిపింది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా సెక్సువల్ గా ప్రేరేపించడం లేదా బ్రోతల్ హౌస్ ను నిర్వహించడం వంటివి నేరమని చెప్పింది. మహిళకు తన వృత్తిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 

ఏడాది క్రితం ముగ్గురు మహిళలను వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బాధితులుగా పేర్కొంటూ వారిని ప్రభుత్వ గృహంలో పెట్టారు. అయితే బాధితులను మూడు నెలలకు మించి హోంలో పెట్టడానికి వీలు లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ముగ్గురు మహిళలన రిలీజ్ చేసింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ తన తీర్పులో వెల్లడించారు.  

Leave a Comment