వైసీపీతో కాంగ్రెస్ పొత్తు?.. పీకే కొత్త ఫార్ములా.. జగన్ ఊ అంటారా.. ఊఊ అంటారా..!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వారుండరు. దేశంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన సోనియా గాంధీతో వరుస భేటీలు అయ్యారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించే కాంట్రాక్ట్ ని తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ హైకమాండ్ కి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయటకు వచ్చింది. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ కి ఆయన సలహా ఇచ్చారని సమాచారం. తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారట. తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్ టీఎంసీతో, జార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి వెళ్లడం మేలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారు. 

మిగిలిన రాష్ట్రాల్లో పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగాలని సోనియాకు ప్రశాంత్ కిశోర్ సూచించినట్లు సమాచారం.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కూడా ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం అయితే సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు.

ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద చేసిన ఈ ప్రతిపాదనకు వైఎస్ జగన్ ఒప్పుకుంటారా? లేదా? అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే ఏపీ సీఎం జగన్ కు కేంద్రంలో బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ హవాకు తిరుగులేదు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 

ఒకవేళ జగన్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. ప్రతిపక్షాల విమర్శలకు అడ్డు ఉండదు.. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటూ ప్రతిపక్షాలు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయి. అప్పుడు వైసీపీని ప్రజలు తిరస్కరించే ప్రమాదమూ ఉంది.. పైగా జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఆయన పట్ల సోనియా గాంధీ అవమానకరంగా వ్యవహరించారు. ఇలాంటి సమయంలో జగన్ కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉండడానికి ఇష్టపడతారా? లేదా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. మరీ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానికి చేసిన ఈ ప్రతిపాదన గురించి మీరేమంటారు కామెంట్ చేయండి.. 

Leave a Comment