కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు

కేటీఆర్ సీఎం కావాలని ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే సీఎం కేటీఆర్ కు కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యనించారు. సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పద్మారావు ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ సమక్షంలోనే ఇలా ఆయన వ్యాఖ్యానించడం చర్చానీయాంశంగా మారింది. బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్ కు శాసన సభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. సీఎంగా కేటీఆర్ అన్ని విధాలుగా సమర్ధుడని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. 

Leave a Comment