తండ్రి సమాధి వద్ద సిరాజ్ ప్రార్థనలు..!

ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సమయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరా తండ్రి మరణించిన విషయం తెలిసిందే.. అప్పడు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇండియాకు వెళ్లేందుకు బీసీసీఐ సిరాజ్ కు అవకాశం ఇచ్చింది. అయితే సిరాజ్ మాత్రం తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు అంతటి విషాదంలోనూ టీమ్ తోనే ఉండిపోయాడు. తన తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లాడన్న బాధను దిగమింగుకొని టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. 

కాగా, టీమిండియా జట్టు ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని భారత్ కు వచ్చింది. గురువారం ఉదయం హైదరాబాద్ వచ్చిన టీమిండియా పేసర్ సిరాజ్ నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లాడు. తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేశాడు. తన తండ్రి కలను నిజం చేసే అవకాశం దక్కినందుకు తాను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని ఈ సందర్భంగా సిరాజ్ తెలిపాడు.  

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

You might also like
Leave A Reply

Your email address will not be published.