తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత..!

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో విధించిన అన్ని నిబంధనలు ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో లాక్ డౌన్ పై ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్య శాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయించింది.  

 

Leave a Comment