థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది : ఎయిమ్స్ డైరెక్టర్

కరోనా థర్డ్ వేవ్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు.  భారత్ లో థర్డ్ వేవ్ వ్యాపించడం అనివార్యమని అన్నారు. 6 నుంచి 8 వారాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపారు. 

అన్ లాక్ తో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, వైరస్ అంటేనే మ్యుటేషన్లకు గురవుతూ ఉంటుందని పేర్కొన్నారు. హాట్ స్పాట్లలో తగిన నిఘా అవసరమని సూచించారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోస్ మధ్య అంతరం తగ్గించడం సవాల్ గా మారిందని ఆయన వెల్లడించారు. 

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ల నుంచి ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్ లాక్ చేయడంతో కనీస కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని గులేరయా తెలిపారు. ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగి, కోవిడ్ థర్డ్ వేవ్ రావడం ఖాయమని డాక్టర్ గులేరియా హెచ్చరించారు. 

Leave a Comment