పాఠాలు చెప్పలేదని.. రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్..!

బీహార్ చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన జీతం రూ.23 లక్షలను తాను పనిచేసిన కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశాడు.. ముజఫర్ పూర్ ప్రాంతంలోని నితీశ్వర్ కళాశాలలో లాలన్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 25, 2019 నుంచి కళాశాలలో ఆయన పనిచేస్తున్నారు.  

అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులు ఉన్నారు.. వీరిలో ఒక్కరు కూడా క్లాసులకు హాజరుకాలేదు.. దీంతో కాలేజీలో ఆయన చేస్తున్న టీచింగ్ తో సంతృప్తిగా లేనని లాలన్ కుమార్ తెలిపారు. తీసుకుంటున్న జీతానికి చేస్తున్న పనికి సమతూకంగా లేదని మనస్సాక్షి చెప్పిందన్నారు. 

అందుకే తనకు వచ్చిన 33 నెలల జీతం మొత్తం రూ.23 లక్షలను పని చేస్తున్న యూనివర్సిటీకి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువు చెప్పకపోతే తాను ఎందుకు జీతం తీసుకోవాలన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని రిజిస్ట్రార్ కి రాసిన లేఖ కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, పీఎంవో, రాష్ట్రపతికి పంపారు.. అయితే రిజిస్ట్రార్ మాత్రం లాలన్ కుమార్ ఇచ్చిన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరారు. అయితే తనను బదిలీ చేయాలని ఆయన పట్టుబట్టారు.. 

 

Leave a Comment