స్టూడెంట్ కి లవ్ ప్రపోజ్ చేసిన మాస్టర్..!

పాఠాలు చెప్పాల్సిన గురువే దారి తప్పాడు.. ఓ విద్యార్థినికి సినిమా స్టయిల్ లో లవ్ ప్రపోజ్ చేశాడు. అందరూ చూస్తుండగానే మోకాళ్లపై కూర్చొని ఐలవ్ యూ చెప్పాడు. అసోం రాష్ట్రం దేమాజీ నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కేంద్రంలో మనోజ్ కుంబంగ్ అనే వ్యక్తి ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. 

అందులో శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థినిపై మనోజ్ మనసు పడ్డాడు. ఆమెకు క్లాస్ రూంలోనే సినిమాటిక్ స్టయిల్ లో మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ తతంగాన్ని అక్కడ ఉన్న విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఉన్నతాధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు. 

 

Leave a Comment