మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం ఏదైనా సంస్కరించబడాల్సిందే. మంచి, చెడు రెండే మతాలు.. మంచికి వాడని మతం నిరుపయోగం.. రోజురోజుకు పరిస్థితిలు దిగజారిపోతున్నాయి. హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. అయితే తాజాగా బీహార్ లోని పట్నాలో జరిగిన సంఘటన మాత్రం దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ఓ చెంపదెబ్బ లాంటిది.. ఓ హిందూ వ్యక్తి చనిపోతే.. అతని అంత్యక్రియలో ముస్లింలు పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో అతడి అంత్యక్రియులు చేశారు..
పాట్నాలో మొహమ్మద్ రిజ్వాన్ ఖాన్ కి ఓ కుట్లు అల్లికల ఉత్పత్తుల షోరూం ఉంది. రామ్ దేవ్ షా అనే వ్యక్తి రిజ్వాన్ షోరూంలో పాతికేళ్ల పాటు నమ్మకంగా పనిచేశాడు. రామ్ దేవ్ ఇటీవల వృధ్యాప్యంతో చినిపోయారు.. విషయం తెలిసిన రిజ్వాన్ ఆ పెద్దాయన పాడే మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రిజ్వాన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అంతిమ యాత్రలో ఉన్నారు.
ఈ సందర్భంగా రిజ్వాన్ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాతికేళ్లి క్రితం ఓ పెద్దాయన తన దుకాణానికి వచ్చి పని అడిగాడని, మోటు పనిచేయలేవని చెబితే.. లెక్కలు రాసే పని అయినా ఇవ్వమని బతిమాలాడని రిజ్వాన్ తెలిపారు. తన వద్ద 20 ఏళ్లకు పైగా పని చేశారని, వయసు రిత్యా ఇబ్బందులతో బాధపడుతుంటే.. నెల నెల కొంత డబ్బు పంపించానని చెప్పారు. షా తనకు తండ్రి లాంటి వారని తెలిపారు. తన చేతనైన రీతిలో ఆయన కుటుంబాన్ని ఆదుకుంటానని రిజ్వాన్ అన్నారు.