సిటీ బస్సులో ప్రయాణం చేసిన సీఎం స్టాలిన్.. షాక్ అయిన ప్రయాణికులు.. వైరల్ వీడియో..!

తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. సీఎం స్టాలిన తన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవల సడెన్ గా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన స్టాలిన్.. తాజాగా సిటీ బస్సులో ప్రయాణించారు. 

చెన్నైలోని టీ నగర్ నుంచి కన్నగినగర్ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు. సీఎం స్టాలిన్ ని బస్సులో చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. బస్సులో సౌకర్యాలపై స్టాలిన ఆరా తీశారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. సీఎం బస్సులో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగారు. కాగా.. తమిళనాడులో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. 

 

Leave a Comment