బాదుడు మొదలుపెట్టిన ‘ఫోన్ పే’.. మండిపడుతున్న యూజర్స్..!

ఈ రోజుల్లో మనీ ట్రాన్సాక్షన్ కోసం ఆన్ లైన్ యాప్ లను వాడుతున్నారు. ట్రాన్సాక్షన్ కోసం చాలా మంది ఫోన్ పేని వాడుతున్నారు. ఇప్పుడు ఫోన్ పే యూజర్స్ కు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, గ్యాస్ బుకింగ్, మొబైల్ రీచార్జ్ వంటి సేవలను ఉచితంగా అందించింది. అయితే ఇటీవల ఈ సేవలపై ఫోన్ పే బాదుడు మొదలుపెట్టింది. ఎలాంటి హడావుడి లేకుండా యూజర్ ఛార్జీల విధానాన్ని ప్రవేశపెట్టింది. 

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రైవేట్ రంగంలో ఉన్న డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్ స్క్రిప్షన్ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్ పే కూడా వచ్చేసింది. యూజర్స్ కి ఈ విషయం చెప్పకుండానే యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది.

మొబైల్ రీఛార్జీలకు సంబంధించి రూ.50 లోపు ఉన్న రీఛార్జ్ ని ఉచితంగానే అదిస్తోంది. కానీ రూ.50 నుంచి రూ.100 మధ్య రీఛార్జ్ చేస్తే ఒక రూపాయి యూజర్ సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తోంది. రూ.100 కు మించితే రెండు రూపాయలు యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. అయితే కొద్ది మంది మాత్రమే యూజర్ ఛార్జీల పరిధిలోకి వస్తారని పోన్ పే కవరింగ్ చేస్తోంది. ఇలా చెప్పకుండా యూజర్ ఛార్జీలను వసూలు చేయడం పట్ల యూజర్స్ మండిపడుతున్నారు. ఫోన్ పే తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు ఫ్రెండ్స్.. 

 

Leave a Comment