ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే హెల్మెట్ ధరించాల్సిందే.. ఎందుకంటే ? 

బైక్ పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోవడం సహజం..కానీ ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకుంటోంది ఓ కుటుంబం.. పిట్టల భయంతో ఆ కుటుంబం ఇంటి పెరట్లో హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు.. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెంలో నివాసముంటున్న సుద్దాల ఉమారాణి ఇంటి పెరట్లో అరటి చెట్టు ఉంది. అక్కడ అరటి గెలపై పిట్ట గూడు వేసింది. దీంతో జాలిపడిన ఉమారాణి ఆ గూడును తీసేయకుండా అలానే ఉంచారు. 

ఆ గూడులో పిల్ల గుడ్లు పెట్టడం పొదగడం చేసింది. అరటి కాయలు రోజురోజుకు పెరగటం వల్ల పిట్ట గూడు కింద పడిపోయే విధంగా ఒరిగింది. దీంతో ఉమారాణి భర్త గూడును సరిచేసే ప్రయత్నం చేసింది. ఈక్రమంలో పిట్టలు తన గూడును తీసేస్తారేమో అని ముక్కులతో మొదలుపెట్టాయి. పెరట్లోకి వెళ్తే చాలు రెండు పిట్టలు వాళ్ల ఇంటిల్లిపాదిపై దాడి చేస్తున్నాయి. నెలరోజులుగా వారికి ఇవే తిప్పలు.. వాటి పోరు భరించలేక ఆ ఇంటివారు తలకు హెల్మెట్ పెట్టుకుని పెరట్లో పనులు చేసుకుంటున్నారు. కళ్లల్లో ఎక్కడ.. పొడుస్తుందోనని భయంతో ఆ ఇంటి వారు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. హెల్మెట్ పెట్టుకుని తిరుగుతుంటే చుట్టుపక్కల వారు నవ్వుతున్నారని, కానీ ఆ చిన్న పిచ్చుక కోసం అలా చేస్తున్నామని ఉమారణి తెలిపింది. పిల్లలు పెరిగి ఎగిరిపోయే వరకు తమకు ఈ బాధలు తప్పవని చెబుతోంది.   

Leave a Comment