ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. 61 ఏళ్లకు రిటైర్మెంట్..!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్  ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఫిట్ మెంట్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అంతే కాదు రాష్ట్రంలోని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.    

Leave a Comment