జీవితంపై విరక్తితో యూట్యూబ్ లో చూసి ఆత్మహత్య..!

జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలా మరణించాలి అని యూట్యూబ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చేసింది. కర్ణాటకలోని బీదర్ కు చెందిన జీవన్ అంబటె(33) మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అతడు అమెజాన్ కంపెనీలో టీం లీడర్ గా ఉద్యోగం చేస్తూ బెంగళూరులోని మహదేవపురా, లక్ష్మీనగర్  లేఅవుట్ లో నివాసం ఉంటున్నాడు.

అయితే జీవన్ తాను జీవితంలో ఏమీ సాధించలేదని బాధపేవాడు. అనంతరం డిప్రెషన్ కు లోనయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్య ఎలా చేసుకోవాలో యూట్యూబ్ లో వెతిడం ప్రారంభించాడు. చివరికి తాను చనిపోయేందుకు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ను ఎన్నుకున్నాడు. ప్రయోగాల కోసమని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ముఖాన్ని ప్లాస్టిక్ సంచితో కప్పుకొని అందులోకి పైప్ ను పెట్టుకున్నాడు. తర్వాత కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ను పీల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అంతే కాదు తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ కూడా రాశాడు. ‘జీవితంలో ఎన్నో సాధించాని కలలు కన్నాను.. కానీ అవన్నీ నెరవేరలేదు. తానో యంత్రంలా మారిపోయా. ఈ జీవితం తనకు నచ్చలేదు’ అంటూ సూసైడ్ నోట్ లో రాశాడు. అతడు చనిపోయిన మూడు రోజుల తర్వాత అతని స్నేహితులు గదికి వచ్చి చూశారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. 

అయితే జీవిన్ చనిపోయే ముందు తన ఫొటోతో ఉన్న ఒక కాగితాన్ని ఇంటి డోర్ కు అతికించాడు. ఇంటి తలుపు ఎలా తెరవాలో అందులో బొమ్మ గీశాడు. లోపలికి వచ్చిన తర్వాత కరెంట్ స్విచ్ లు వేయవద్దని, వేస్తే మంటలు అంటుకునే ప్రమాదం ఉందని అందులో పేర్కొన్నాడు. కిటికీలు, తలుపులు అన్ని తెరవాలని, గ్యాస్ వాల్వ్ యూసివేయాలని సూచించాడు.  

Leave a Comment