ఏపీలో ఆ రెండు గంటలే టపాసులు కాల్చాలి..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఈక్రమంలో దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజున టపాసులు కాల్చేందుకు రెండు గంటలే సమయం ఇచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  

దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటల పాటు టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఇక టపాసులు అమ్మే షాపుల మధ్య 6 అడుగుల దూరం కచ్చితంగా పాటించాలని పేర్కొంది. షాపుల ముందు క్యూ ఉండకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంకా దీపావళి టపాసులు విక్రయించే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని సూచించింది.  

 

Leave a Comment